: ఏపీలో మధ్యంతర ఎన్నికలు గ్యారెంటీ: ఆళ్ల నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి ఐదేళ్లూ పరిపాలన సాగించడం అసంభవమని, ఏ రోజైనా మధ్యంతర ఎన్నికలు రావచ్చని వైఎస్సార్ సీపీ నేత ఆళ్ల నాని అంచనా వేశారు. దేశం నేతలు ఆయన విధానాలపై విసుగు చెందారని, గత్యంతరం లేక ఆయన మాటలకు వంత పాడుతున్నారని విమర్శించారు. ప్రజలు సైతం విసిగిపోయారని, త్వరలోనే తిరుగుబాటు వస్తుందని నాని తెలిపారు. సమస్యల పరిష్కారానికి తమ పార్టీ ఉద్యమ బాట పడుతోందని చెప్పారు. చంద్రబాబుకు కాంగ్రెస్ నాయకులూ సహకరిస్తున్నారని నాని ఆరోపించారు. తన కోటరీతో రాజధాని ప్రాంతంలో కోట్లాది రూపాయల భూ కుంభకోణాలకు బాబు తెరలేపారని అన్నారు.