: 'మ్యావ్' అంటున్న లంక పులులు!


లంక పులులు పిల్లులుగా మారాయి. గాండ్రిస్తారనుకుంటే 'మ్యావ్'మంటున్నాయి. ఆఫ్గాన్ తో జరుగుతున్న క్రికెట్ పోరులో ఓపెనర్లు తిరిమన్నే, దిల్షాన్ 'సున్నా' పరుగులకు, కెప్టెన్ సంగక్కర 7 పరుగులకు అవుట్ అయ్యి శ్రీలంకను పీకల్లోతు కష్టాలలోకి నెట్టారు. ఆఫ్గాన్ బౌలర్లు చెలరేగుతుండటంతో వికెట్ల మధ్య పరుగులు చేసేందుకు లంక ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. కెప్టెన్ సంగక్కర 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హమీద్ హసన్ బౌలింగ్ లో దొరికిపోయాడు. ప్రస్తుతం లంక స్కోర్ 8 ఓవర్లలో 31/3.

  • Loading...

More Telugu News