: ముందు పులివెందుల... తరువాతే కుప్పం!: చంద్రబాబు


తనకు ప్రజలంతా ఒకటేనని, ముందు పులివెందులకు నీళ్లు తెప్పించిన తరువాతే కుప్పంకు నీరందిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాయలసీమలోని గండికోట ప్రాజెక్టుకు ఈ ఏడాదిలోనే నీళ్లు ఇస్తామని ఆయన అన్నారు. కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చిన రైతులతో మాట్లాడుతూ, 'పులివెందులకు నీరు అందించగలిగితే, చీని, అరటి వంటి పంటలతో రైతులు బలోపేతం అవుతారని, యుద్ధప్రాతిపదికన గాలేరు-నగరి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రెండేళ్లలో పులివెందులను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పై విమర్శలు చేశారు.

  • Loading...

More Telugu News