: పాక్ అభిమానుల ఆగ్రహానికి టీవీలు పగిలాయి...శవయాత్ర, అంత్యక్రియలు కూడా చేసేశారు!


తొలిసారి భారత్, రెండోసారి వెస్టిండీస్ తో కూడా పాకిస్థాన్ జట్టు ఘోరంగా పరాజయం పాలవ్వడాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ తో ఓటమే అవమానమని భావిస్తే, వెస్టిండీస్ తో చెత్త ప్రదర్శనతో రికార్డు సృష్టించి మరీ ఓడిపోవడాన్ని అస్సలు తట్టుకోలేకపోయారు. దీంతో ఆగ్రహాంతో ఊగిపోయారు. వీళ్లిక మారరంటూ చూస్తున్న టీవీలను పగలు కొట్టారు. బ్యాట్లు, వికెట్లు, బంతులు మూట కట్టి వీధుల్లో శవయాత్ర చేసి, అనంతరం సదరు క్రీడా సామగ్రి మొత్తానికి అంత్యక్రియలు నిర్వహించారు. 'మీరిక క్రికెట్ ఆడలేరు కానీ, దానికి స్వస్తి చెప్పి, జాతీయ క్రీడలు హకీ, ఫుట్ బాల్ పై దృష్టి సారించండి' అంటూ హితవు పలికారు. దీంతో పాక్ క్రీడాకారులు ఈసారి కూడా స్వదేశం స్వేచ్ఛగా వెళ్లే అవకాశం కనిపించడం లేదు.

  • Loading...

More Telugu News