: 5400 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి...హింస పెట్టేశారు: హీరో నాని
షూటింగ్ కోసం హిమాలయాల్లోని 5,400 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లిన దర్శకుడు తనను హింస పెట్టేశాడని నాని తెలిపాడు. తీరా అంత ఎత్తుకు తీసుకెళ్లిన నాలుగు రోజులకు నిర్మాతలు వెళ్లిపోయారని ఆక్షేపించాడు. హైదరాబాదులో జరిగిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఆడియో వేడుకలో నాని మాట్లాడుతూ, హిమాలయాల్లో ఆక్సిజన్ అందని ప్రాంతాల్లో గంటల తరబడి నడిపించిన దర్శకుడు హింస పెట్టేశాడని తెలిపాడు. అలా, అంత ఎత్తున నడుస్తుంటే కళ్ల ముందు మరో నాని ప్రత్యక్షమయ్యేవాడని చెప్పాడు. ప్రతి నాలుగు రోజులకు ఒకరు చొప్పున ఆ పరిస్థితులకు తట్టుకోలేక వెనుదిరుగుతుంటే, నాలుగైదు రోజులు విమానం దొరక్క వెనుదిరిగిన రోజులున్నాయని నాని చెప్పాడు. విమానంలో రెండు గంటలకు పైగా కూర్చుంటే విమానం బయల్దేరేది కాదని, అందుకే ఈ సినిమా జీవితాంతం గుర్తుండిపోతుందని నాని అభిప్రాయపడ్డాడు.