: ఏడాదికి రెండు సినిమాలు తీస్తా...కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తా: బండ్ల గణేష్


టెంపర్ సినిమా తనకు ఎంతో శక్తి నిచ్చిందని సినీ నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. హైదరాబాదులో జరిగిన టెంపర్ సక్సెస్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా విజయం సాధించకపోతే ఇక సినిమాలే తీయకూడదనుకున్నానని అన్నారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ అద్భుతమైన విజయం సాధించిందని ఆయన చెప్పారు. ఈ సినిమా ఇచ్చిన స్పూర్తితో ఇకపై ప్రతి ఏడాది రెండు సినిమాలు నిర్మిస్తానని, మరో కొత్త దర్శకుడికి అవకాశమిస్తూ సినిమా తీస్తానని ఆయన హామీ ఇచ్చారు. మరోసారి పూరీ, ఎన్టీఆర్ అవకాశమిస్తే వారితో సినిమా తీస్తానని, వారు ఆ అవకాశం ఇస్తారనే భావిస్తున్నానని బండ్ల గణేష్ చెప్పారు.

  • Loading...

More Telugu News