: తారక్, పూరీకి అభినందనలు:సచిన్ జోషీ
జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కు అభినందనలని సచిన్ జోషీ తెలిపారు. హైదరాబాదులో జరిగిన 'టెంపర్' సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమా అద్భుతమైన విజయం సాధించేందుకు దోహద పడిన అభిమానులకు ధన్యవాదాలని అన్నారు. ఎన్టీఆర్ నటన గురించి అందరికీ తెలిసిందేనని చెప్పిన ఆయన, మంచి టీంతో విజయవంతమైన సినిమా తీశారని అన్నారు. అభిమానులను అలరించే సినిమా తీయడంలో ఎంతో ఆనందం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తనను సక్సెస్ మీట్ కు పిలిచినందుకు ధన్యవాదాలని ఆయన తెలిపారు.