: జీవితం ఎవర్నీ వదలదు...అందరికీ సరదా తీర్చేస్తుంది: పూరీ జగన్నాథ్
జీవితం ఎవర్నీ వదలదు... అందరికీ సరదా తీర్చేస్తుందని టెంపర్ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలిపారు. హైదరాబాదులో జరిగిన టెంపర్ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, అలా చాలా కాలానికి సరైన విజయం ఇచ్చిందని అన్నారు. ఈ సినిమా కారణంగా డబ్బులే కాదు గౌరవం కూడా వచ్చిందని పూరీ చెప్పారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలని చెప్పారు. ఎన్టీఆర్ తో పని చేయడం ప్రతి దర్శకుడి కల అని చెప్పారు. అలాంటి ఎన్టీఆర్ తో పని చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రకాశ్ రాజ్ నటన అద్భుతమని అన్నారు.