: నితీష్ కుమార్ కు ఆర్జేడీ, సీపీఐ, కాంగ్రెస్ మద్దతు
బీహార్ లో మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యంలో ఏర్పాటు చేయనున్న జేడీ (యూ) కొత్త ప్రభుత్వానికి మద్దతు పెరుగుతోంది. నితీష్ కు మద్దతివ్వాలని ఆర్జేడీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు నిర్ణయించాయి. బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి 24 మంది సభ్యులుండగా, కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు, సీపీఐకి ఒకరు ఉన్నారు. నెల రోజులపాటు బీహార్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి రేపటితో తెరపడనుంది. రేపు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి పలురాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారు కూడా ప్రమాణస్వీకారోత్సవంపై ఆసక్తి ప్రదర్శిస్తున్న విషయం కూడా తెలిసిందే.