: మార్చి 7 నుంచి 27 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
మార్చి 7 నుంచి 27వ తేదీ వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన బడ్జెట్ పై పలు కీలక అంశాలను గవర్నర్ తో చర్చించారు. ఈ నెల 11న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన గవర్నర్ కు తెలిపారు. అనంతరం ఈ నెల 12న సెలవు రోజు కావడంతో బడ్జెట్ పై చర్చ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనుందని ఆయన గవర్నర్ కు వివరించారు. 27వ తేదీతో బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయని ఆయన స్పష్టం చేశారు.