: కేరళ సీపీఎంలో సంక్షోభం... పార్టీని వీడనున్న అచ్యుతానందన్


కేరళ సీపీఎంలో సంక్షోభం నెలకొంది. పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ పార్టీని వీడబోతున్నట్టు సమాచారం. తన ప్రత్యర్థి పినారై విజయన్ నేతృత్వంలో ఈరోజు జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో తనపై తీవ్ర విమర్శలు చేయడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేయడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సమావేశం జరుగుతుండగానే అచ్యుతానందన్ బయటకి వెళ్లిపోయారు. పార్టీ ప్రత్యర్థులకు ఆయన సహాయం చేస్తున్నారంటూ విజయన్ వర్గం ఆరోపించింది. దాంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన అచ్యుతానందన్ కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవి నుంచి కూడా వైదొలగనున్నట్టు ప్రకటించారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News