: కేసీఆర్ సీఎం అనుకోవడం లేదు... రాజుననుకుంటున్నాడు: షబ్బీర్ అలీ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు భావిస్తున్నట్టుగా లేదని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ముఖ్యమంత్రి అని భావించడం లేదని, తెలంగాణ రాజ్యానికి రాజుననే భ్రమలో ఉన్నారని అన్నారు. వాస్తు పిచ్చితో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం కాన్వాయ్, నివాసం కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారని ఆయన విమర్శించారు. ప్రజలు కోరుతున్న పింఛన్లు, ఉద్యోగ, ఉపాథి అవకాశాలపై తెలంగాణ ప్రభుత్వం మాట్లాడడం లేదని ఆయన ఆరోపించారు. వాస్తు పిచ్చితో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News