: పోలీసుల అదుపులో అమ్మాయిలను సరఫరా చేస్తున్న జంట!


నల్గొండ, హైదరాబాదు నుంచి వ్యభిచారం నిమిత్తం విశాఖపట్టణానికి అమ్మాయిలను సరఫరా చేస్తున్న భార్యాభర్తలను సూర్యాపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జాతీయ రహదారిలో పోలీసులు రోజువారీ తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ కారులో దంపతులతో పాటు ఆరుగురు యువతులు అనుమానాస్పద స్థితిలో కనిపించారు. వారిని పోలీసులు ప్రశ్నించడంతో విశాఖలో ప్రోగ్రాం చేసేందుకు వెళ్తున్నట్టు చెప్పారు. దీంతో కారును తనిఖీ చేసిన పోలీసులకు కారులో కండోమ్ ప్యాకెట్లు, ఇతర వస్తువులు కనిపించడంతో అనుమానం వచ్చి వారిని విచారించారు. దీంతో వారు అసలు విషయం చెప్పారు. వారిని అదుపులోకి తీసుకుని సూర్యాపేట మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఈ రాకెట్ లో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న ఇద్దరూ భార్యాభర్తలని పైకి చెప్పుకుంటున్నప్పటికీ వారు సన్నిహితంగా ఉంటున్నారు తప్ప, భార్యాభర్తలు కాకపోవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News