: 'ఏఐబీ రోస్ట్' వివాదంలో ఎవరి పక్షాన మాట్లాడలేను: షారుక్


ఏఐబీ రోస్ట్... ఇటీవల అభ్యంతరకర హాస్యంతో వివాదాస్పదమైంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్, హీరోలు అర్జున్ కపూర్, రణ్ వీర్ సింగ్ లు పాల్గొని, వినేందుకు వీలులేని భాష ఉపయోగించారని, చాలా రోత పుట్టించే విధంగా మాట్లాడారని విమర్శలొచ్చాయి. దాంతో కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఈ అంశంపై నటుడు షారుక్ ఖాన్ స్పందన అడిగితే చాలా జాగ్రత్తగా స్పందించాడు. "హాస్యం అనేది చాలా గమ్మత్తైన విషయం అనిపిస్తుంది. ఎప్పుడూ ప్రజల నుంచి వేర్వేరు ప్రతిచర్యలు ప్రేరేపిస్తుంది. అయితే నేను హాస్యాన్ని విశ్వసిస్తాను. ఎంటర్ టైన్ చేసే సమయంలో ఎప్పుడూ నేను ఉపయోగించే పదాల పట్ల జాగ్రత్తగా ఉంటా. నేనెప్పుడూ హాస్య స్పూర్తిని నమ్ముతుంటా. కొన్నేళ్ల నుంచి నా హాస్య విధానాన్ని తగ్గించా. ఎందుకంటే హాస్యం విషయానికొస్తే ఒక సన్నని లైను ఉంటుంది. ఎప్పుడూ దానివల్ల ఓ తీవ్రమైన స్పందన ఉంటుంది. మీరు నవ్వొచ్చు లేదా ఇష్టపడకపోవచ్చు. నాలా పాప్యులర్ నటుడు అయితే... ఏది మాట్లాడినా ప్రజలు వింటారు. అలాంటప్పుడు ఒకసారి పరిశీలించుకోవాలి. ఎల్లప్పుడూ సమస్యలు, ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి నేనెవరి పక్షాన మాట్లాడలేను" అని కింగ్ ఖాన్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News