: చిన్నారులకు ప్రత్యేకంగా యూట్యూబ్ కొత్త యాప్
సామాజిక మాధ్యమాల్లో వీడియో షేరింగ్ సేవలందిస్తున్న వెబ్ సైట్ యూట్యూబ్ తాజాగా పిల్లల కోసం కొత్త యాప్ ను విడుదల చేయనుంది. ఇప్పుడున్న యూట్యూబ్ లో అసభ్య వీడియోలు ఉన్నాయని పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ యాప్ ను విడుదల చేస్తున్నట్టు యూట్యూబ్ తెలిపింది. సోమవారం దీన్ని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం విడుదల చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధి బెన్ యెర్ తెలిపారు. చదువు, విజ్ఞానం, ఆటలకు సంబంధించిన వీడియోలు ఈ పిల్లల యూట్యూబ్ యాప్లో అందుబాటులో ఉంటాయన్నారు.