: లోక్ సత్తాలో ముదిరిన బహిష్కరణ వివాదం... పోటీ జాతీయకమిటీ ప్రకటన!


లోక్ సత్తా పార్టీ 'బహిష్కరణ' వివాదం మరింత ముదిరింది. కొన్ని రోజుల కిందట బహిష్కరణకు గురైన వర్మ, కటారి శ్రీనివాసరావు కలసి తమకు తాముగా పార్టీ నూతన జాతీయ కమిటీని ప్రకటించుకున్నారు. ఈ మేరకు పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా కటారి శ్రీనివాసరావు పేరును వర్మ వెల్లడించారు. శ్రీవాస్తవకు (జయప్రకాశ్ నారాయణ ప్రకటించిన ప్రస్తుత లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు) పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, కమిటీ వేసే హక్కు కూడా లేదని వర్మ, కటారి అన్నారు. ఈ మేరకు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇదిలావుంటే, కొద్దిసేపటి కిందట లోక్ సత్తా జాతీయ అధ్యక్ష హోదాలో పార్టీ ఏపీ శాఖకు కొత్త అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను శ్రీవాస్తవ ప్రకటించిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News