: నయాగరా గడ్డకడుతోంది!
నయాగారా జలపాతం గడ్డకట్టుకుపోయింది. ఎప్పుడూ ప్రవహించే నీళ్లతో కళకళలాడుతుండే నయాగరా జలపాతాలు ఉన్నట్టుండి మంచు కొండల్లా మారిపోయాయి. దాంతో దీన్ని చూసేందుకు పర్యాటకులు వెల్లువెత్తుతున్నారు. నయాగరా ఫాల్స్ లో అమెరికా వైపు ఉండే ప్రాంతమంతా బాగా చలిగా ఉండటంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో నీళ్ల స్థానంలో మంచుకొండలు దర్శనమిస్తున్నాయి. జలపాతం దగ్గరున్న చెట్లపై పేరుకున్న మంచుతో అవి మనోహరంగా కనిపిస్తున్నాయి. వీటిని బంధించేందుకు గడ్డకట్టుకుపోయే చలిలో కూడా పర్యాటకులు కెమెరాలు పట్టుకుని పోటీలు పడుతున్నారు.