: ఢిల్లీ రోడ్లపై ఆప్ ఎంఎల్ఏల అల్లర్లు... ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు


ఒక మహిళపై వేధింపుల కేసులో పోలీసులు సరైన రీతిలో స్పందించడం లేదని ఆరోపిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేసిన నిరసన ఉద్రిక్తంగా మారింది. రాజకీయ నేతలు సైతం కల్పించుకోవడంతో, రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులపై రాళ్లురువ్వారు. ఈ ఘటనలో ఇద్దరు ఆప్ ఎంఎల్ఏలు సంజీవ్ ఝా, అఖిలేష్ త్రిపాఠిలకు ప్రమేయం ఉందని గుర్తించిన బురారి పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులే దురుసుగా ప్రవర్తించారని ఎంఎల్ఏలు ఆరోపించారు. తమపై తుపాకులు ఎక్కుపెట్టారని, కార్యకర్తలను కొట్టారని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News