: ఢిల్లీ క్రీడల ప్రచారకర్తగా రెజ్లర్ సుశీల్ కుమార్


దేశ రాజధాని ఢిల్లీలో క్రీడలను మరింత ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్రీడల ప్రచారకర్తగా రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా క్రీడల ప్రత్యేక కార్యక్రమాలను కూడా అతను ప్రమోట్ చేయనున్నాడు. ఈ మేరకు సుశీల్ మాట్లాడుతూ, "ఢిల్లీలో క్రీడలను మరింత అభివృద్ధి చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం మంచి ఆలోచనలు చేస్తోంది. నేను కూడా కొన్ని ప్రతిపాదనలు చేశాను" అని తెలిపారు.

  • Loading...

More Telugu News