: కార్పొరేట్ గూఢచర్యంలో రూ.10,000 కోట్ల స్కాం?


సంచలనం సృష్టించిన కార్పొరేట్ గూఢచర్యం కేసులో కొత్త విషయం బయటికొచ్చింది. ఈ వ్యవహారంలో రూ.10వేల కోట్ల కుంభకోణం జరిగిందని జర్నలిస్టు, కన్సల్టెంట్ శంతను సైకియా వెల్లడించారు. అయితే పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి బయటికొచ్చిన కీలక పత్రాలతో తనకెలాంటి సంబంధం లేదని తెలిపాడు. "కేవలం నేనీ విషయాన్ని దాచుంచాను. ఇది రూ.10,000 కోట్ల స్కాం మాత్రమే. ఈ కేసులో నేను కేవలం దర్యాప్తు మాత్రమే చేస్తున్నా" అని ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ కార్యాలయం బయట మీడియాకు తెలిపాడు. ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టేది లేదని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన అనంతరం సైకియా ఇలా చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News