: ఏపీలో లోక్ సత్తాకు కొత్త అధ్యక్ష, కార్యదర్శులు
లోక్ సత్తా పార్టీ ఏపీ శాఖకు కొత్త అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ పట్టాభిరామయ్య, బీసెట్టి బాబ్జీలను నియమించినట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సురేంద్ర శ్రీవాస్తవ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కొత్త కార్యవర్గం కృషి చేస్తుందని ఆయన వివరించారు. అంతకుముందు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడుతూ, కొత్త నాయకత్వం రావాలన్న ఆలోచనతో తాను పదవి నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.