: అప్పుడు హోదా అడిగిన బీజేపీనే ఇప్పుడు ఏమీ పట్టనట్టు ఉంటోంది: ఎంపీ మేకపాటి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. అయితే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని బీజేపీనే అడిగిందని, ఇప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు క్షమించరన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాలను లేవనెత్తుతామన్న మేకపాటి, తమ పార్టీ అధ్యక్షుడు వైెఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సమస్యలు వదిలేసి విదేశీ పర్యటనలంటూ తిరుగుతున్నారని విమర్శించారు.