: టీడీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం... కేంద్ర బడ్జెట్ పై చర్చ


తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పార్టీ ఎంపీలందరూ పాల్గొన్నారు. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ సందర్భంగా అనుసరించవలసిన విషయాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా ఏపీ పునర్విభజన చట్టంలోని హామీల సాధనకు ప్రయత్నించాలని బాబు ఎంపీలకు సూచించనున్నారు. అటు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరనున్నారు. రాష్ట్రానికి రావల్సిన నిధులు, వాటిని సాధించుకునేందుకు చేయవల్సిన ప్రయత్నాలపై ఎంపీలంతా దృష్టి పెట్టాలని కోరనున్నారు.

  • Loading...

More Telugu News