: రాహుల్ వస్తువులకు ఎంతొస్తుంది?... మోదీ ధరించినందుకే ఆ సూటుకు అంత విలువన్న శివసేన
మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీపై అంతెత్తున ఎగిరిపడ్డ శివసేన, నెల తిరక్కముందే తిరిగి ఆ పార్టీకి మద్దతుగా నిలిచింది. మోదీ సూటు వేలంపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలపై విరుచుకుపడ్డ శివసేన, ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తేసింది. మోదీ ధరించినందుకే సదరు సూటుకు భారీ విలువ వచ్చిందన్న ఆ పార్టీ, రాహుల్ వస్తువులను వేలం వేసి చూడండి, ఎంతొస్తుందో! మీ విలువేమిటో అప్పుడు తెలుస్తుందంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఢిల్లీ సీఎం పీఠాన్ని చేజిక్కించుకున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లను కూడా శివసేన వదిలి పెట్లలేదు. ‘‘కేజ్రీవాల్ జీ... మీ మఫ్లర్ వేలం వేసి చూడండి’’ అంటూ తన పత్రిక సామ్నాలో శివసేన వ్యాఖ్యానించింది.