: గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ కు స్వైన్ ఫ్లూ... సూరత్ లో చికిత్స


దేశంలోని పలు రాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ బారి నుంచి ప్రముఖులు కూడా తప్పించుకోలేకపోతున్నారు. గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ గణపత్ వాసవకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు పరీక్షలు చేసిన వైద్యులు, స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు. దీంతో గురువారం రాత్రి ఆయన సూరత్ లోని మహావీర్ ఆస్పత్రిలో చేరారు. మూడు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని, అనుమానం వచ్చిన గాంధీనగర్ సివిల్ ఆస్పత్రి వైద్యులు ఆయన నమూనాలను పరీక్షల కోసం పంపగా వ్యాధి నిర్ధారణ అయ్యిందని మహావీర్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ దాసిల్వా చెప్పారు.

  • Loading...

More Telugu News