: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు... చెరో పాయింట్


వరల్డ్ కప్ క్రికెట్ 2015 పోటీలకు తొలిసారిగా వరుణుడు అడ్డువచ్చాడు. ఒక మ్యాచ్ ని తన పేరిట రాసుకున్నాడు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య బ్రిస్బేన్ లో జరగాల్సిన పోటీ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకూ చెరో పాయింటు వచ్చినట్టు ఐసీసీ ప్రకటించింది. ఉదయం నుంచి వర్షం తగ్గకుండా పడుతూ ఉండటంతో, కనీసం 20 ఓవర్ల మ్యాచ్ నైనా జరిపించాలని అంపైర్లు భావించారు. వర్షం తగ్గే సూచనలు లేకపోవడంతో, మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు పూల్ ఏలో 3 విజయాలతో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లు తదుపరి కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News