: ములాయం మనవడు, లాలూ కుమార్తె వివాహ విందుకు మోదీ
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మనవడు, మెయిన్ పురి ఎంపీ తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివాహానికి ముందు ములాయం సొంత గ్రామం సైఫైలో నిర్వహించిన విందు కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. ప్రధానికి ములాయం స్వాగతం పలికారు. ఇక నిత్యం విమర్శలు చేసుకునే ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, మోదీ ఈ సందర్భంగా కరచాలనం చేసుకుని నవ్వుతూ పలకరించుకున్నారు. ఈ సాయంత్రం తేజ్ ప్రతాప్ కు, లాలూ కుమార్తె రాజ్యలక్ష్మీకి ఘనంగా వివాహం జరగనుంది. దాదాపు లక్షమంది ఈ పెళ్లికి వస్తారని అనుకుంటుండగా, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు హాజరవుతారని భావిస్తున్నారు.