: నేషనల్ పోలీస్ అకాడెమీని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ... 9 మంది ట్రైనీ ఐపీఎస్ లకు వ్యాధి నిర్ధారణ
తెలుగు రాష్ట్రాలతో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలను కూడా వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూ భావి ఐపీఎస్ అధికారులను తయారు చేస్తున్న హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీని చుట్టేసింది. అకాడెమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ లలో తొమ్మిది మందికి ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వారిని నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని, భయపడాల్సిన అవసరమేమీ లేదని అకాడెమీ డైరెక్టర్ అరుణా బహుగుణ తెలిపారు.