: మూడురోజుల వేలంలో మోదీ బహుమతులకు రూ.8 కోట్లు


ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వచ్చిన బహుమతులను గుజరాత్ లోని సూరత్ లో వేలంవేసి భారీగా నిధులను రాబట్టారు. మొత్తం మూడు రోజుల పాటు జరిగిన వేలంలో రూ.8 కోట్లు వచ్చాయట. ప్రధానంగా మోదీ బంద్ గలా సూట్ కు రూ.4.31 కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. మిగతా 454 బహుమతుల ద్వారా మిగిలిన నగదు సమకూరింది. అందులో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇచ్చిన టీ-షర్ట్, పలువురు దేవుళ్ల విగ్రహాలు, మహాత్మాగాంధీ గుర్తుగా ఉన్న కళ్ళజోడు, శాలువాలు, తలపాగాలు, ఇవికాక ఇతర కళాకృతులను వేలంలో ఉంచారు. వాటితో పాటు తన తల్లితో మోదీ ఉన్న రెండు ఫోటోలు కూడా ఉన్నాయి. నిధుల సమీకరణకోసం నిర్వాహకుల ప్రయత్నానికి మోదీ ట్విట్టర్ లో కృతజ్ఞత తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తనకు వచ్చిన బహుమతులను వేలంవేసే సంప్రదాయాన్ని మోదీ మొదలుపెట్టారు. అలా 13ఏళ్ల కాలంలో రూ.95కోట్లు సమకూర్చారు. గంగాప్రక్షాళన కోసం ఈ ఎనిమిది కోట్లను వెచ్చించనున్నారు.

  • Loading...

More Telugu News