: ముసుగు వేసే యువతులను... జీపెక్కించండి: పోలీసులకు సాత్నా మేయర్ ఆదేశాలు


నిజమేనండోయ్... యువతులు ముసుగులు ధరించడాన్ని సాత్నా నగర పాలక సంస్థ నిషేధించిందట. మధ్యప్రదేశ్ లోని సాత్నాలో ఇకపై ముసుగులతో కనిపించే యువతులను పోలీసులు అరెస్ట్ చేసేస్తారట. ఎందుకంటే, నగర మేయరు ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సాత్నా కొత్త మేయర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మమతా పాండే, ముసుగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హిందూ మహిళలు తలపై నుంచి కొంగు వేసుకోవాలి. ముస్లిం మహిళలు బురఖా వేసుకోవాలి. కాని ఈ మధ్య అమ్మాయిలు దొంగల్లా ముఖాన్ని ముసుగులు చుట్టేస్తున్నారు. ఇకపై ఇలాంటివి కుదరవు’’ అని మమతా పాండే వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News