: తప్పు చేస్తే వెంకన్న వదలడు... బాబు హెచ్చరిక
"మీరంతా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి పాదాల వద్ద పని చేస్తున్నారు. ఎటువంటి తప్పూ చేయవద్దు. ఎవరు తప్పు చేసినా వెంకన్న వారిని వదలకుండా శిక్షిస్తాడు" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తిరుమలలో పనిచేసే అందరూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. మీడియా సైతం బాధ్యతగా విధులను నిర్వహించాలని కోరారు. ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించడం ద్వారా వెంకటేశ్వర మహాత్మ్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని ఎస్వీబీసీ ఛానల్ అధికారులను బాబు ఆదేశించారు.