: పింఛన్ డబ్బును ఇంటి పన్నుకు జమేసుకున్న అధికారులు... 'ఆసరా' లేక ఆగిన గుండె
ఇంటి పన్ను బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ, ఆసరా పింఛన్ డబ్బులను అధికారులు జమ చేసుకోగా, ఆందోళనతో ఒక వృద్ధ గుండె ఆగింది. ఈ ఘటన వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం పాకాలలో జరిగింది. బూరుక యాకయ్య (70)కు వృద్ధాప్య పింఛన్ కింద రూ.1,000, ఆయన కుమారుడు, మానసిక వికలాంగుడైన కృష్ణకు రూ.1500ల పింఛన్ వస్తోంది. ఆ డబ్బులు ఇస్తున్నారని తెలిసి, తెచ్చుకునేందుకు వెళ్లిన కృష్ణ ఎంతకూ ఇంటికి రాలేదు. యాకయ్య ఆరా తీయగా, పింఛన్ డబ్బు ఇంటి పన్ను కింద జమచేసుకున్నారని తెలిసింది. తండ్రి మందలిస్తాడని కొడుకు పరారు కాగా, తీవ్ర ఒత్తిడికి లోనైన యాకయ్య గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ప్రాంతంలో మరింతమంది పింఛన్ డబ్బులు పన్నుకింద అధికారులు జమ చేసుకున్నట్టు తెలుస్తోంది.