: డబ్బులిస్తావా? లేక ఆ ఫొటోలు బయటపెట్టాలా?: మెదక్ లో ఇంజినీరింగ్ విద్యార్థిపై సీనియర్ల వేధింపులు
మెదక్ జిల్లాలోని హషిమ్ ఇంజినీరింగ్ కళాశాలలో నేటి ఉదయం కలకలం రేగింది. ఈ కళాశాలలో చదువుతున్న అశోక్ రెడ్డి అనే విద్యార్థిపై సీనియర్లు వేధింపులకు దిగారు. అశోక్ రెడ్డిని నిర్బంధించి డబ్బులు డిమాండ్ చేసిన సీనియర్లు జుబేర్, బిలాల్, సంతోష్, ఆసిఫ్, జిషాన్ లు, డబ్బులివ్వకపోతే అమ్మాయిలతో దిగిన ఫొటోలను కళాశాల నోటీస్ బోర్డులో పెడతామంటూ బెదిరించారు. దీనిపై నిన్నటిదాకా నోరు మెదపని అశోక్ రెడ్డి నేటి ఉదయం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అశోక్ రెడ్డిని వేధింపులకు గురి చేసిన సీనియర్లను అదుపులోకి తీసుకున్నారు.