: పాక్ బోటుపై ఎలాంటి దాడి జరగలేదు... తేల్చేసిన సర్కారీ వీడియో!


గుజరాత్ తీరంలో పేలిపోయిన పాకిస్థాన్ బోటుపై ఎలాంటి దాడి జరగలేదట. దేశంలో ‘ఉగ్ర’ దాడులు చేసేందుకు గుట్టుచప్పుడు కాకుండా గుజరాత్ తీరం చేరిన పాకిస్థానీ టెర్రరిస్టులు, భారత నిఘా వర్గాలు గమనించడంతో తమను తాము పేల్చేసుకున్నారని నాడు రక్షణ మంత్రి హోదాలో మనోహర్ పారికర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సదరు బోటును తామే పేల్చేశామని, లేకపోతే పాక్ ఉగ్రవాదులకు బిర్యానీ ప్యాకెట్లు అందించాల్సి వచ్చేదని తీరగస్తీ దళాధికారి లోషాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో దీనిపై పెను వివాదం రేగింది. లోషాలి ప్రకటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందంటూ లోషాలి ప్రకటించారు. ఈ వివాదానికి తెర దించే క్రమంలో కేంద్రం తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. సదరు వీడియోలో పాక్ బోటుపై దాడి జరిగిన దాఖలా కనిపించలేదు.

  • Loading...

More Telugu News