: ఆండ్రాయిడ్ ఫోన్లకు కొత్త వైరస్ ‘ద ఇంటర్వ్యూ’తో పెనుముప్పు!
ఇండియాలోని ఆండ్రాయిడ్ సిస్టమ్ ఆధారిత స్మార్ట్ మొబైల్ ఫోన్లపై దాడి చేసేందుకు సరికొత్త వైరస్ ‘ద ఇంటర్వ్యూ’ సైబర్ స్పేస్ లో చక్కర్లు కొడుతోంది. గత సంవత్సరం అమెరికా-ఉత్తర కొరియాల మధ్య వాగ్వాదానికి దారితీసిన వివాదాస్పద హాలీవుడ్ చిత్రం ‘ద ఇంటర్వ్యూ’ పేరిట స్మార్ట్ ఫోన్లలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తోంది. స్మార్ట్ ఫోన్లలో ఎవరైనా ఈ చిత్రం ఉచిత డౌన్ లోడ్ లింక్‌ను క్లిక్ చేస్తే ట్రోజన్ తరహా వైరస్ ఫోన్లోకి చేరి వారి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తుంది. ఈ వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేశీయ సైబర్ భద్రతా పరిరక్షణ నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) హెచ్చరించింది.