: అగ్రి గోల్డ్, అభయ గోల్డ్ ఆస్తుల జప్తు... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు


అధిక వడ్డీలను ఆశ చూపి జనం నెత్తిన కుచ్చుటోపి పెట్టిన అగ్రి గోల్డ్, అభయ గోల్డ్ ఆస్తులను జప్తు చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అతి తక్కువ కాలంలోనే అధిక వడ్డీలతో డబ్బును రెట్టింపు చేసి ఇస్తామన్న మాయ మాటలతో తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించిన అగ్రి గోల్డ్ యాజమాన్యం, మెచ్యూరిటీ తీరిన బాండ్లకు సొమ్ము చెల్లించడంలో చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ వ్యవహారాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పలు ఆసక్తికర అంశాలను వెలికితీశారు. జనం సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులను బ్యాంకుల వద్ద తనఖా పెట్టిన అగ్రిగోల్డ్ భారీగా రుణాలు తీసుకుంది. సదరు రుణాల వాయిదాల చెల్లింపుల్లోనూ ఆ సంస్ధ విఫలమైంది. మరోవైపు అగ్రిగోల్డ్ ఆధ్వర్యంలోని అభయ గోల్డ్ కూడా రూ. 133 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందని తేలింది. దీంతో ఈ రెండు సంస్థల ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News