: మీడియాకు 'నో ఎంట్రీ’పై కేసీఆర్ వెనకడుగు... నేడు జర్నలిస్టులతో ప్రత్యేక భేటీ


సచివాలయంలోకి మీడియా ప్రవేశంపై నిషేధం విధించాలన్న తన నిర్ణయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త వెనక్కు తగ్గారు. సచివాలయంలోకి మీడియా ప్రవేశంపై నిషేధమన్న వార్తలపై మీడియాతో పాటు విపక్షాలు నిన్న భగ్గుమన్నాయి. దీంతో కాస్త వెనకగుడు వేసిన కేసీఆర్, 'ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా?' అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అయినా మీడియా మితిమీరిన జోక్యంతో ఇబ్బందులు తలెత్తుతున్న విషయాన్ని మీడియా ప్రతినిధులకు తెలియజేసి, ఆ తర్వాత తన నిర్ణయాన్ని అమలు చేయాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా నేడు ఆయన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రెస్ అకాడెమీలో జరగనున్న ఈ భేటీలో పలువురు సీనియర్ అధికారులు కూడా పాలుపంచుకునే అవకాశం లేకపోలేదు.

  • Loading...

More Telugu News