: చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ వెకిలి చేష్టలు... ప్రేమించలేదని టెన్త్ విద్యార్థినిపై దాడి


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఆర్టీసీ డ్రైవర్ వెకిలి చేష్టలు వెలుగు చూశాయి. సత్యవేడు పరిధిలో నేటి ఉదయం వెలుగులోకొచ్చిన ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న సుమన్ అనే వ్యక్తి పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై దాడి చేశాడు. ప్రేమ పేరిట సదరు బాలికను కొంతకాలం పాటు వేధించిన సుమన్, బాలిక తన ప్రేమను తిరస్కరించిందని దాడికి దిగాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు సత్యవేడు పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సుమన్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News