: ఒక్క రోజు కాల్చిన బాణాసంచా ఆ దేశంలో వాయు కాలుష్యం పెంచేసింది
చైనాలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందట. చైనా నూతన సంవత్సర వేడుకలు ఆ దేశాన్ని పెద్ద ఇబ్బందికి గురిచేశాయి. ఈ ఏడాది చైనా నూతన సంవత్సర వేడుకలు ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా చైనీయులు కాల్చిన బాణసంచా కారణంగా 106 పట్టణాలలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఓ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. కేవలం బుధవారం సాయంత్రం నుంచి గురువారం రాత్రి వరకు ఉపయోగించిన బాణాసంచా కారణంగానే కాలుష్యం పెరిగినట్టు ఆ న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు సర్వే నిర్వహించినట్టు ఆ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.