: ఆస్కార్ వేదిక సమీపంలో బాంబు కలకలం
అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో ఈ నెల 22న 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి అద్భుత రీతిన వేదిక సిద్ధమవుతోంది. ఈ వేదిక సమీపంలో బాంబు ఉందంటూ ప్రచారమైన వార్త కలకలం రేపింది. దీంతో హుటాహుటీన పోలీసులు ఆస్కార్ వేదిక వద్దకు బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. అయితే అక్కడ బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాగూ వచ్చిన పోలీసులు, అక్కడ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు.