: విరాట్ క్రిస్టియానో రొనాల్డో కోహ్లీ...ఎవరీయన?
అదేంటి, విరాట్ క్రిస్టియానో రొనాల్డో కోహ్లీ ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు? మన టీమిండియా ఆశాకిరణం విరాట్ కోహ్లీయే. ఇంతకీ పేరు మార్పులో కారణం ఏంటంటే, మన కోహ్లీ ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డోకి వీరాభిమాని. ప్రతి టోర్నీకి కొత్త హెయిర్ స్టైల్ తో దర్శనమిచ్చే రోనాల్డో లాగే కోహ్లీకి కూడా హెయిర్ స్టైల్స్ మార్చే అలవాటుంది. అరంగేట్రం నుంచి వివిధరకాల హెయిర్ స్టైల్స్ అభిమానులకు పరిచయం చేసిన విరాట్ కోహ్లీ తాజాగా, క్రిస్టియానో రొనాల్డో లేటెస్ట్ హాఫ్ కట్ హెయిర్ స్టైల్ కి ఫిదా అయిపోయాడు. అంతే, అదే హెయిర్ స్టైల్ ను కోహ్లీ కూడా చేయించుకున్నాడు. సౌతాఫ్రికాతో ఆదివారం జరగనున్న మ్యాచ్ లో కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ తో దర్శనమివ్వనున్నాడు.