: ఉద్యోగానికి రాజీనామా చేసిన ఎన్జీవో నేత దేవీప్రసాద్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణ ఎన్జీవోల నేత దేవీ ప్రసాద్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. మెదక్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేవీప్రసాద్ రాజీనామాను అధికారులు ఆమోదించాల్సి ఉంది. దేవీ ప్రసాద్ గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతారని అంతా భావించినప్పటికీ, టీఆర్ఎస్ టికెట్టివ్వలేదు. దీంతో అప్పట్లో ఆయన కాస్త అసంతృప్తి చెందినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఆయన అందుకు సిద్ధమయ్యారు.