: భర్తను చంపించిన ఉరిశిక్ష ఖైదీ ఆఖరి మెనూ ఇదే!


ఉరిశిక్ష పడిన ఖైదీని ఆఖరు కోరిక ఏంటని అడగడం ప్రజాస్వామ్య దేశాల్లో సర్వసాధారణంగా జరుగుతుంది. అలాంటప్పుడు ఖైదీలు తమ కుటుంబ సభ్యులను కలుసుకోవాలని, లేదా తనకు ఇష్టమైన భోజనం ఏర్పాటు చేయాలని కోరుతుంటారు. అలాగే అమెరికాలో మరణశిక్ష అమలు కానున్న ఖైదీ రెనీ గిసెండర్ ను జార్జియా పోలీసులు అడిగారు. రెనీ గిసెండర్ 1997లో లో తన భర్త డగ్లస్ గిసెండర్ ను తన బాయ్ ఫ్రెండ్ గ్రెగరీ బూస్ ద్వారా హత్య చేయించింది. విచారణలో తానే హత్య చేయించినట్టు అంగీకరించింది. దీంతో 1998లో ఆమెకు అమెరికా కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో ఆమెకు ఈ నెల 25న మరణశిక్ష అమలు కానుంది. దీంతో ఆమెను పోలీసులు చివరి కోరిక ఏంటని అడిగితే మంచి భోజనం చేయాలనుందని చెప్పిన ఆమె, మెనూను వివరించింది. అవేంటంటే... మొక్క జొన్నతో చేసిన బ్రెడ్డుతో మజ్జిగ, వెన్నతో రెండు బర్గర్ కింగ్ వోపర్స్, రెండు ఫుల్ ప్రైస్, చెర్రీ వెనీలా ఐస్ క్రీం, పాప్ కార్న్, ఉడకబెట్టిన గుడ్లు, టమోటాలు, ఉల్లిపాయలు, క్యారెట్లను కలిపి పెప్పర్ తో తయారు చేసిన సలాడ్, నిమ్మకాయల రసం... ఇది ఆమె చివరి కోరిక. అనంతరం అధికారులు ఆమెకు ఇంజెక్షన్ ద్వారా మరణశిక్షను అమలు చేస్తారు.

  • Loading...

More Telugu News