: ఏప్రిల్ లో చంద్రబాబు చైనా పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విదేశంలో పర్యటించబోతున్నారు. త్వరలో ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి 6వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటిస్తారు. ఆయన నేతృత్వంలో కొంతమంది ప్రతినిధుల బృందం చైనా వెళ్లనుంది. భారత్ తో సత్సంబంధాల కోసం దేశం నుంచి ప్రతినిధి బృందాన్ని చైనా ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆ బృందానికి నేతృత్వం వహించాలని విదేశాంగ మంత్రిత్వశాఖ బాబును కోరింది. ఇందుకు తన సమ్మతి తెలుపుతూ బాబు ఆ శాఖకు ఓ లేఖ రాశారు.