: అమీర్ పేటలో సందడి చేసిన సమంత


టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత హైదరాబాదులోని అమీర్ పేటలో సందడి చేసింది. నటన, సేవా కార్యక్రమాల ద్వారా తెలుగు సినీ అభిమానులను అలరిస్తున్న సమంతకు తెలుగునాట అంతులేని ఆదరణ ఉంది. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన సినిమాలు పెద్దగా విడుదల కానప్పటికీ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా సమంత కొనసాగుతుండడం విశేషం. కాగా, ఈ సుందరి అమీర్ పేటలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైంది. పాత్ర డిమాండ్ మేరకు సినిమాల్లో కాస్తంత కురచబట్టల్లో కనిపించినప్పటికీ, షాపింగ్ మాల్ ఓపెనింగ్ సెర్మనీకి మాత్రం నిండైన కట్టుబొట్టుతో వచ్చి అలరించింది. పాతతరం ఫ్యాషన్ ను అనుకరిస్తూ ఆమె ధరించిన వస్త్రధారణ అభిమానులను ఆకట్టుకుంది. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున ఎగబడ్డారు.

  • Loading...

More Telugu News