: ముగిసిన కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక బృందం కోర్ కమిటీ భేటీ ముగిసింది. ఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భేటీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో పాటు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్, ఆజాద్, అహ్మద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఇటీవల దేశంలో చోటు చేసుకున్న పలు సంఘటనలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికలు, పార్లమెంటు తాజా సమావేశాలు, జాయింట్ పార్లమెంటరీ సంఘం నివేదికలు వంటి అంశాలపై సుమారు 45 నిమిషాల పాటు ఈ చర్చలు సాగాయి.