: భద్రాచలం కన్నా ముందే కట్టిన ఒంటిమిట్ట రామాలయం... శ్రీరామనవమి ఇక్కడే
ఖమ్మం జిల్లాలో గోదావరి నది ఒడ్డున రామదాసు ఆలయాన్ని కట్టడానికి వందల సంవత్సరాలకు ముందే కడప జిల్లాలో ఒంటిమిట్ట రామాలయం పూజలందుకున్న కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక శ్రీరామనవమి వేడుకలు ఇక్కడే జరపనుందని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. శ్రీరామనవమి రోజున స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. 11వ శతాబ్దంలోనే ఈ ఆలయం నిర్మించినట్టు ఆధారాలున్నాయని ఆయన తెలిపారు. కొత్త రాజధాని ప్రాంతంలో దేవాదాయశాఖ భూములను త్వరలోనే ప్రభుత్వానికి అప్పగిస్తామని, రైతులు తీసుకున్నట్టుగానే పరిహారం తీసుకుంటామని వివరించారు.