: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర నగరాలివే


ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ప్రయాణం హాబీగా కూడా మారిపోయింది. దీంతో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా విహారయాత్రలకు వెళ్తున్నారు. దీంతో కొన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర నగరాలుగా పేర్కొన్న పది నగరాల జాబితా విడుదల చేశారు. ఈ నగరాల్లో డ్రగ్ మాఫియా, దోపిడీ దారులు, రౌడీలు విరుచుకుపడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కనుక మీరు ఏ దేశం వెళ్లాలనుకుంటున్నారో అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో ఓ సారి తరచి చూసుకుని వెళ్లడం అవసరమని పేర్కొంటున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన టాప్ టెన్ నగరాలివే... కారకాస్ (వెనిజులా), సియుడాడ్ జువారెజ్ (మెక్సికో), కేప్ టౌన్ (సౌతాఫ్రికా), రియో-డీ- జనీరో (బ్రెజిల్), గ్వాంటెమాలా సిటీ (గ్వాంటెమాలా), అకాపుల్కో (మెక్సికో), బాగ్దాద్ (ఇరాక్), కాబూల్ (ఆఫ్ఘనిస్థాన్), కరాచీ (పాకిస్థాన్), శాన్ పెడ్రో సూలా (హోండూరస్)

  • Loading...

More Telugu News