: పార్టీలో ఎవరు క్రమశిక్షణ తప్పినా చర్యలు తప్పవు: జేపీ


లోక్ సత్త ప్రజలకు వేదికగా వచ్చిన పార్టీ అని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. పార్టీలో ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల పార్టీ నుంచి కీలక నేతలు కటారీ శ్రీనివాస్, వర్మలను సస్పెండ్ చేయడంపై జేపీ ఈవిధంగా స్పందించారు. పార్టీ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడాల్సిందేనని, ఎవరూ పార్టీకి అతీతులు కాదన్నారు. వ్యక్తిగత భేషజాలు పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేయాలని జేపీ పిలుపునిచ్చారు. వ్యక్తుల కంటే పార్టీ, పార్టీ కంటే దేశం ఎక్కవనేది తమ సిద్ధాంతమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News