: వీడియోకాన్ నుంచి వైఫై ఏసీలు


వైఫై ఆధారంగా ఎక్కడి నుంచైనా నియంత్రించుకోగల స్మార్ట్ ఎయిర్ కండిషన్ మెషిన్ లను వీడియోకాన్ మార్కెట్లోకి విడుదల చేసింది. వీరిని వినియోగదారులు తమ స్మార్ట్‌ ఫోన్‌ లోని యాప్ ద్వారా నియంత్రించవచ్చని తెలిపింది. రెండు రంగుల్లో 4 మోడళ్లలో, 1, 1.5 టన్నుల రేంజ్‌ లో వీటిని తయారు చేసినట్టు సంస్థ ప్రతినిధి ఒకరు వివరించారు. 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉన్న ఈ ఏసీల ధరలు రూ.35,990 నుంచి రూ.41,990 మధ్య ఉంటాయని తెలిపారు. బయటి వాతావరణానికి అనుగుణంగా తనకు తానే చల్లదనాన్ని సవరించుకునే 'అవర్లీ వెదర్ ఫీడ్ ఫీచర్' దీనికి అదనపు ఆకర్షణ అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News